Google Job Without Coding: కోడింగ్ రాకపోయినా గూగుల్‌లో ఉద్యోగం సాధించడం ఎలా?

యువతలో ఒక సాధారణ సందేహం ఉంది—“కోడింగ్ రాకపోతే, గూగుల్‌లో జాబ్ వస్తుందా?” అని. నిజానికి దీనికి సమాధానం “అవును”. కోడింగ్ తెలియకపోయినా, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల్లో మంచి జీతాలున్న ఉద్యోగాలను పొందడానికి బోలెడన్ని అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్, టెక్నికల్ సపోర్ట్ వంటి అనేక నాన్-కోడింగ్ రోల్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉన్నవారికి గూగుల్‌లో అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్‌లో కోడింగ్ లేకుండా గూగుల్‌లో లభించే ఉద్యోగాలు, వాటి జీతాలు మరియు ఎలా అప్లై చేయాలో పూర్తిగా తెలుసుకుందాం.

Coding లేకుండా Googleలో Jobs ఉంటాయా?

చాలామంది గూగుల్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మాత్రమే ఉంటారనే అపోహలో ఉంటారు. కానీ గూగుల్‌లో వేలాది నాన్-టెక్నికల్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు:

డిజిటల్ మార్కెటింగ్ & సేల్స్

యూఐ/యూఎక్స్ డిజైన్ (UI/UX Design)

కంటెంట్ రైటింగ్ & టెక్నికల్ రైటింగ్

హెచ్‌ఆర్ జాబ్స్ & ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్

కస్టమర్ & టెక్నికల్ సపోర్ట్

ఈ జాబ్స్‌లో కోడింగ్ అవసరం చాలా తక్కువ లేదా అసలు ఉండదు.

1. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ (Digital Marketing Specialist)

ప్రస్తుతం గూగుల్ యాడ్స్, యూట్యూబ్ మార్కెటింగ్, ఎస్ఈఓ (SEO) వంటి స్కిల్స్‌కు డిమాండ్ ఎక్కవగా ఉంది. ఈ రోల్‌లో వెబ్‌సైట్లు ప్రమోట్ చేయడం, యాడ్ క్యాంపెయిన్స్ మేనేజ్ చేయడం, ట్రాఫిక్ అనాలిసిస్ చూడటం మరియు కీవర్డ్ రీసెర్చ్ చేయడం వంటి పనులు ఉంటాయి.

కావలసిన నైపుణ్యాలు: ఎస్ఈఓ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ మీడియా నాలెడ్జ్ మరియు గూగుల్ అనలిటిక్స్.

సగటు జీతం: రూ. 5 LPA – రూ. 15 LPA వరకు ఉంటుంది.

2. కంటెంట్ రైటర్ (Content Writer)

మీకు ఆర్టికల్స్ రాయడం ఇష్టమైతే గూగుల్‌లో కంటెంట్-రిలేటెడ్ రోల్స్ ట్రై చేయవచ్చు. ఇందులో బ్లాగులు, హెల్ప్ ఆర్టికల్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ మరియు ఏఐ కంటెంట్ రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ రైటింగ్, గ్రామర్, రీసెర్చ్ స్కిల్స్ ముఖ్యం. మీకు ఇప్పటికే బ్లాగింగ్ అనుభవం ఉంటే సెలక్షన్ ఛాన్స్ మరింత పెరుగుతుంది.

3. ప్రాజెక్ట్ మేనేజర్ (Project Manager)

గూగుల్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నాన్-కోడింగ్ రోల్స్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి. గూగుల్ మ్యాప్స్‌లో కొత్త అప్‌డేట్ లాంటి ఫీచర్స్ డెవలప్ చేస్తున్నప్పుడు, దానికి కావాల్సిన ప్లానింగ్ అంతా వీరే చూసుకుంటారు. ఇంజనీర్లు, డిజైనర్లు మరియు మార్కెటింగ్ టీమ్ అందరినీ సమన్వయం చేస్తూ పని సకాలంలో పూర్తయ్యేలా చూడటం వీరి బాధ్యత. దీనికి లీడర్‌షిప్, టైమ్ మేనేజ్‌మెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం.

4. యూఐ/యూఎక్స్ డిజైనర్ (UI/UX Design)

మనం గూగుల్ సెర్చ్ వాడుతున్నప్పుడు లేదా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు బటన్స్ ఎక్కడ ఉండాలి, కలర్స్ ఎలా ఉండాలి అని నిర్ణయించేది యూఎక్స్ డిజైనర్సే. యూజర్లకు యాప్ వాడటం సులభంగా ఉండేలా డిజైన్ చేయడం వీరి పని. దీనికి కోడింగ్ కంటే యూజర్ సైకాలజీ మరియు విజువల్ డిజైన్ మీద అవగాహన ఉండాలి. ఫిగ్మా (Figma), అడోబ్ ఎక్స్డీ (Adobe XD) వంటి టూల్స్ నేర్చుకుంటే చాలు.

5. టెక్నికల్ రైటింగ్ & సపోర్ట్

టెక్నికల్ రైటర్: టెక్నాలజీ గురించిన సమాచారాన్ని ఇతరులకు అర్థమయ్యేలా డెవలపర్ గైడ్స్, హెల్ప్ సెంటర్ ఆర్టికల్స్ రూపంలో రాయాలి. ఇంగ్లీష్ మీద పట్టు ఉంటే సరిపోతుంది.

టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్: కోడింగ్ లేకపోయినా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్‌తో కస్టమర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ట్రబుల్‌షూటింగ్ వంటి సపోర్ట్ రోల్స్ చేయవచ్చు.

గూగుల్‌లో నాన్-కోడింగ్ జాబ్స్ పొందడానికి 5 సింపుల్ స్టెప్స్

సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోండి: గూగుల్ కేవలం మీ డిగ్రీని చూడదు. మీలోని ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యం, టీమ్‌వర్క్ మరియు గూగుల్ కల్చర్‌కు సరిపోయే తత్వాన్ని గమనిస్తుంది.

స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో : మీరు డిజైనర్ అయితే మీ డిజైన్లను, రైటర్ అయితే మీ ఆర్టికల్స్‌ను ఒక ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియోలా చూపించండి.

సర్టిఫికేషన్లు : కోడింగ్ లేకపోయినా కోర్సులకు సంబంధించిన గూగుల్ కెరీర్ సర్టిఫికేట్లు పూర్తి చేస్తే రెజ్యూమెకి మంచి వెయిటేజీ వస్తుంది.

నెట్‌వర్కింగ్ : లింక్డిన్‌లో గూగుల్‌లో పనిచేస్తున్న వారితో కనెక్ట్ అవ్వండి. వారి సలహాలు, రెఫరల్స్ ఉద్యోగం పొందడంలో సహాయపడతాయి.

ఇంటర్వ్యూ ప్రిపరేషన్: సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు, క్లిష్టపరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో పరీక్షించే బిహేవియరల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి.

ముగింపు

"నాకు కోడింగ్ రాదు, ఇక టెక్ కంపెనీల్లో ఉద్యోగం రాదు" అనే అభద్రతాభావాన్ని వదిలేయండి. టెక్నాలజీ ప్రపంచం చాలా విశాలమైనది. మీలో కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ లేదా మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉంటే గూగుల్ తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సరైన దిశలో ప్రయత్నం మొదలుపెట్టండి, విజయం మీదే అవుతుంది!

Share Icon

🎤 What is your reaction?
ఈ కథనంపై మీ స్పందన ఏమిటి?
Next Post
Previous Post
No Comment
Add Comment
comment url
Home Home Menu Menu