అక్టోబర్ 15 నుండి కొత్త UPI నిబంధనలు: ఏది మారుతుంది? ఎవరికి వర్తిస్తుంది?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం మరియు ఎన్‌పీసీఐ (NPCI) ఒక కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేశాయి. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుండి అమల్లోకి రానున్నాయి. చాలామంది సోషల్ మీడియాలో "ఇకపై యూపీఐ పేమెంట్స్ అన్నీ ఫ్రీ కాదా?" అని ఆందోళన చెందుతున్నారు. అసలు నిజం ఏంటంటే—సాధారణ వినియోగదారులకు (Consumers) ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.
ముఖ్యమైన కొత్త నిబంధనల :
సామాన్య వినియోగదారులకు (Consumers) పూర్తిగా ఫ్రీ!
➢ మీరు మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు డబ్బులు పంపినా (P2P Transfers), లేదా మీ సొంత బ్యాంకు ఖాతాల మధ్య ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా ఎటువంటి ఛార్జీలు ఉండవు.
➤ ఎంత పెద్ద మొత్తమైనా సరే, వ్యక్తిగత లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే.
రూ.2,000 పైన మర్చంట్ పేమెంట్స్‌పై MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్):
➢ మీరు ఏదైనా దుకాణానికి లేదా వ్యాపారికి (Person-to-Merchant - P2M) చేసే UPI చెల్లింపు రూ.2,000 దాటితే, ఆ లావాదేవీపై 0.4% MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) వర్తిస్తుంది.
గమనిక:ఈ రుసుమును వినియోగదారులు (Customer) చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని కేవలం వ్యాపారులు (Merchants) మాత్రమే భరించాలి.
➢ రూ. 75,000 అంతకంటే ఎక్కువ లావాదేవీలపై ఈ MDR గరిష్టంగా రూ. 300 వరకు పరిమితం (Cap) చేయబడింది.
చిన్న వ్యాపారులకు పూర్తి మినహాయింపు (Zero MDR):
➢ చిన్న చిన్న దుకాణదారులు, రోడ్డు పక్కన వెండార్లు, మరియు నెలకు రూ. 1 లక్ష వరకు క్యూఆర్ కోడ్ (UPI QR) ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వబడింది. వీరికి ఎటువంటి MDR ఛార్జీలు వర్తించవు.
➢ అలాగే, రూ. 2,000 లోపు జరిగే చిన్న మర్చంట్ పేమెంట్స్ అన్నీ ఎప్పుడూ లాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి.
కొన్ని ప్రత్యేక రంగాలకు ప్రత్యేక నిబంధనలు:
కొన్ని నిర్దిష్ట రంగాల మర్చంట్ చెల్లింపులకు వేరే నిబంధనలు ఉన్నాయి:
➢ రైల్వేలు, టెలికాం సేవలు, ఇన్సూరెన్స్ మరియు ఫ్యూయల్ (పెట్రోల్/డీజిల్):రూ. 2,000 పైన చేసే పేమెంట్స్‌పై ప్లాట్ రేట్‌గా రూ. 5 MDR వర్తిస్తుంది.
➢ మ్యూచువల్ ఫండ్స్ & క్యాపిటల్ మార్కెట్స్: స్టాక్ బ్రోకర్లు, సెక్యూరిటీస్ మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన వన్-టైమ్ పేమెంట్స్‌పై 0.02% MDR (గరిష్టంగా రూ. 300 వరకు) ఉంటుంది. అయితే, ముందుగానే సెట్ చేసుకునే UPI ఆటోపే (AutoPay / SIP) లావాదేవీలు దీని కింద భిన్నంగా ట్రీట్ చేయబడతాయి.
ప్రభుత్వం ఈ మార్పులు ఎందుకు తెస్తోంది?
భారత్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారీ డిజిటల్ పేమెంట్స్ నెట్‌వర్క్ యొక్క భద్రతను (Cybersecurity) మరింత పటిష్టం చేయడానికి, సర్వర్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత విస్తరించడానికి అయ్యే ఖర్చుల నిర్వహణ కోసం ఈ సుస్థిరమైన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చినట్లు NPCI మరియు RBI వెల్లడించాయి.
ముగింపు:
సాధారణ ప్రజలు లేదా కస్టమర్లు రోజువారీ చేసే యూపీఐ లావాదేవీలపై ఎటువంటి భారం పడదు. ఇది కేవలం పెద్ద వ్యాపారులు మరియు మర్చంట్ వ్యవస్థకు సంబంధించిన విషయం మాత్రమే.