తెలంగాణ రైతులకు (El Nino) బిగ్ అలర్ట్: ఎకరాకు రూ. 10,000 ఇస్తున్న రేవంత్ సర్కార్!

Telangana government announcing Rs 10,000 per acre El Nino crop loss compensation for farmers.

తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో (El Nino) ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు, అలాగే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు మరియు అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఎక్కెడక్కడ ఎంత నష్టం? (జిల్లాల వారీగా అంచనా):

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.18 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ యంత్రాంగం సీఎంకు నివేదిక సమర్పించింది. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.59 లక్షల ఎకరాలు, జోగులాంబ గద్వాలలో 1.45 లక్షలు, నాగర్‌కర్నూల్‌లో 1.42 లక్షలు, రంగారెడ్డిలో 1.29 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా నష్టపోయిన వాటిలో 80 శాతం (సుమారు 8.93 లక్షల ఎకరాలు) పత్తి పంట ఉండటం గమనార్హం.

ఎకరాకు రూ. 10,000 పరిహారం సిఫారసు:

ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10,000 చొప్పున పరిహారం అందించాలని అధికారులు ప్రభుత్వానికి గట్టిగా సిఫారసు చేశారు.

రూ. 2,178 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ:

కేవలం పంట నష్టమే కాకుండా, రాష్ట్రంలో తలెత్తబోయే తాగునీరు, సాగునీరు మరియు పశువుల సంరక్షణ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు మొత్తం రూ. 2,178.68 కోట్ల అంచనా నివేదికను రూపొందించారు:

➥ వ్యవసాయం & ఉద్యానవన పంట నష్టానికి: రూ. 1,986.89 కోట్లు

➥ పశుసంవర్ధక శాఖ సహాయం కోసం: రూ. 42.10 కోట్లు

➥ తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు (ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. కోటి చొప్పున) ప్రత్యేక నిధులు.

తాగునీటి ఇబ్బందులు & సింగూరు అలర్ట్:

రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు సాధారణం కంటే తగ్గిపోయి కేవలం 54 శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా సింగూరు జలాశయంలోని నీరు డిసెంబర్ 10 వరకు మాత్రమే సరిపోతుందని అంచనా వేశారు. దీంతో సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఉపాధి హామీ పనుల పెంపు & కేంద్ర సాయం:

గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో కూలీల ఉపాధి కోసం అక్టోబరు నుంచి మార్చి వరకు 11 కోట్ల పనిదినాలు కల్పించేలా ఉపాధి హామీ పనులను విస్తరించాలని ప్రతిపాదించారు. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ. 20,000 కోట్ల సహాయం కోరాలని, అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Read Also

Share Icon

🎤 What is your reaction?
ఈ కథనంపై మీ స్పందన ఏమిటి?
Next Post
Previous Post
No Comment
Add Comment
comment url