నవంబర్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్:Unknown Calls, Spam Calls వస్తే ఇక అసలు పేరే కనిపిస్తుంది!
![]() |
| november-1-spam-calls-new-rules-cnap.jpg |
మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం 5 నుంచి 10 స్పామ్ లేదా అనామక కాల్స్ వస్తూనే ఉంటాయి. "మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాం", "కార్ లోన్ కావాలా?", "మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది" అంటూ వచ్చే ఈ స్పామ్ కాల్స్ కేవలం మన సమయాన్ని వృథా చేయడమే కాకుండా, అమాయకుల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల పాలు చేస్తున్నాయి.
ఇప్పటివరకు మనం ఇలాంటి అనామక కాల్స్ నుంచి రక్షణ పొందడానికి Truecaller వంటి థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడేవాళ్లం. కానీ, నవంబర్ 1, 2026 నుంచి భారత టెలికాం రంగంలో రాబోతున్న ఒక కీలక మార్పు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతోంది.
నవంబర్ 1 నుంచి బిగ్ అప్‌డేట్: స్పామ్, ఫేక్ కాల్స్‌కి చెక్..
నవంబర్ 1, 2026 నుంచి భారత టెలికాం రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) మరియు కేంద్ర టెలికాం శాఖ (DoT) సంయుక్తంగా 'CNAP' (Calling Name Presentation) అనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువస్తున్నాయి. దీనివల్ల ఫోన్‌కి అన్‌నోన్ లేదా స్పామ్ కాల్స్ వస్తే, ఇకపై వారి అసలు పేరే మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది!
సాధారణంగా Truecaller లో ఒక వ్యక్తి పేరు ఎలా కనిపిస్తుంది? ఆ వ్యక్తి యాప్‌లో మార్చుకున్న పేరు లేదా ఇతరులు తమ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకున్న పేరు ఆధారంగా చూపిస్తుంది. అందుకే చాలామంది తమ అసలు పేర్లు కాకుండా ఫేక్ పేర్లు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం.
ఈ కొత్త CNAP సిస్టమ్ సంపూర్ణంగా భిన్నమైనది.
1. సిమ్ KYC ఆధారంగా పేరు: ఒక వ్యక్తి నెట్‌వర్క్ ప్రొవైడర్ (Jio, Airtel, Vi, BSNl) వద్ద సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఇచ్చే ఆధార్ కార్డ్ లేదా అధికారిక ప్రభుత్వ ఐడీ కార్డులోని అసలు పేరు మాత్రమే ఇకపై స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
2. యాప్స్ అవసరం లేదు: దీనికోసం మొబైల్‌లో ప్రత్యేకంగా ఏ యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ సెట్టింగ్స్ మార్చాల్సిన పని కూడా లేదు. Network Level లోనే ఇది ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది.
ట్రూకాలర్‌కి, ఈ కొత్త సిస్టమ్‌కి తేడా ఏమిటి?
➼ చాలామందికి వచ్చే ప్రధాన సందేహం: "ఇప్పటికే ట్రూకాలర్ ఉంది కదా, మరి దీని ప్రత్యేకత ఏంటి?" అని.
➤ డాటా ప్రైవసీ: ట్రూకాలర్ వాడాలంటే మన కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని ఆ యాప్‌కి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ CNAP అనేది టెలికాం ఆపరేటర్ల ద్వారానే నేరుగా పనిచేస్తుంది కాబట్టి మన కాంటాక్ట్ డాటా ఏ ఇతర కంపెనీల చేతికి వెళ్లే ప్రమాదం ఉండదు.
➤ కచ్చితమైన గుర్తింపు: సైబర్ నేరగాళ్లు ట్రూకాలర్‌లో 'Bank Manager' లేదా 'Police' అని ఫేక్ పేర్లు పెట్టుకుని మోసం చేసే అవకాశం ఉండేది. CNAP ద్వారా అలాంటి ఫేక్ ఐడీలకు అసలు తావే ఉండదు. ఆధార్ లో ఉన్న అసలు పేరు మాత్రమే కనిపిస్తుంది.
సామాన్య వినియోగదారుడికి కలిగే ప్రయోజనాలు
▶ సైబర్ ఫ్రాడ్స్‌కి చెక్: బ్యాంక్ అధికారులమని చెప్పి వచ్చే ఫేక్ కాల్స్, పార్సెల్ లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించే కాల్స్‌ను సులభంగా పసిగట్టవచ్చు.
▶ ఇంటర్నేషనల్ స్పామ్ కాల్స్: విదేశాల నుంచి వర్చువల్ నంబర్ల ద్వారా చేసే మోసపూరిత కాల్స్‌కు ప్రత్యేకంగా "International Call" అని డిస్‌ప్లే అవుతుంది.
▶ చౌకైన స్మార్ట్‌ఫోన్లలో కూడా పని చేస్తుంది: కేవలం హై-ఎండ్ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్లలోనే కాకుండా, సాధారణ 4G/5G నెట్‌వర్క్ ఉన్న ప్రతి మొబైల్‌లోనూ ఈ ఫీచర్ ఉచితంగా పనిచేస్తుంది.
ముగింపు
డిజిటల్ విప్లవంతో పాటు సైబర్ మోసాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్న ఈ రోజుల్లో, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ CNAP ఫీచర్ ఒక మంచి పరిణామం. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సేవలతో స్పామ్ మరియు ఫేక్ కాల్స్ భార భారీగా తగ్గే అవకాశం ఉంది. సైబర్ భద్రత దిశగా భారత్ వేసిన ఈ అడుగు ప్రతీ మొబైల్ వినియోగదారుడికి పెద్ద ఊరట నిస్తుదనడంలో సందేహం లేదు.
