"Nelen App: సెట్-టాప్ బాక్స్ లేకుండా నేరుగా ఇంటర్నెట్‌లో: లైవ్ టీవీ & ఓటీటీ"


 ఇంటర్నెట్ డిస్క్ :  నేలెన్ (Nelen) అనేది కేబుల్ లేదా సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా లైవ్ టీవీ ఛానెల్స్ మరియు ఓటీటీ కంటెంట్‌ను అందించే ప్రముఖ OTT & లైవ్ టీవీ అగ్రిగేటర్ యాప్. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం కేంద్రంగా పనిచేస్తున్న "The Bhimavaram Community Network (BCN)" సంస్థ నిర్వహిస్తోంది.

సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలు & ధరలు

ఈ యాప్‌లో ప్రధానంగా రెండు రకాల ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ద్వారా ఏదైనా ఒక స్క్రీన్ - Android Mobile లేదా Smart TV లో మాత్రమే కంటెంట్‌ను వీక్షించవచ్చు.

CTv Pack 1 HDఛానెల్స్: 110+ పే టీవీ లైవ్ HD & SD ఛానెల్స్ + 150+ ఫ్రీ-టూ-ఎయిర్ (FTA) ఛానెల్స్.

ధరలు: 1 నెలకు ₹125. దీంతో పాటు 3 నెలలుకు, 6 నెలలుకు మరియు 1 సంవత్సరానికి కూడా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

CTv Pack 2 HDఛానెల్స్: 120+ పే టీవీ లైవ్ HD & SD ఛానెల్స్ + 150+ ఫ్రీ-టూ-ఎయిర్ (FTA) ఛానెల్స్.

ధరలు: 1 నెలకు: ₹149, 3 నెలలుకు: ₹449, 6 నెలలుకు: ₹849, 1 సంవత్సరం: ₹1649, ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఛానెల్స్ & ఎంటర్‌టైన్‌‌మెంట్: Maa Movies HD, ETV HD, ETV Plus HD, ETV Cinema HD, Star Plus HD, Colors HD, Star Jalsha HD, Star Pravah HD, Asianet HD మొదలైనవి.

స్పోర్ట్స్ (Sports): Star Sports 1 & 2 Telugu Digital, Star Sports 3 Digital, Star Sports Select 1 & 2, Star Sports 1/2 Hindi & Tamil/Kannada Digital మరియు Star Sports Khel Digital.

న్యూస్ ఛానెల్స్ : News18 ఛానెల్స్, CNBC TV18, CNN News 18, తదితర లైవ్ న్యూస్ మరియు మ్యూజిక్ ఛానెల్స్.

యాప్ లభించే డివైస్‌లు & డౌన్‌లోడ్ :

ఈ యాప్ వివిధ రకాల డివైస్‌ల కోసం అధికారికంగా విడుదల చేయబడింది.

ఆండ్రాయిడ్ మొబైల్స్ & స్మార్ట్ టీవీలు: గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుండి నేరుగా "NELEN" అని టైప్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.యాపిల్ డివైస్‌లు (iOS / iPhone / iPad): యాపిల్ యాప్ స్టోర్‌లో (Apple App Store) అందుబాటులో ఉంది.

అదనపు డివైస్‌లు: సాధారణ టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చుకోవడానికి ఫైర్‌స్టిక్ (Firestick) మరియు ప్రత్యేకమైన 4K RDK బాక్సులలో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.నేరుగా వివరాలు తెలుసుకోవడానికి లేదా రీచార్జ్ చేసుకోవడానికి వీరి అధికారిక వెబ్‌సైట్ nelen.in ను సందర్శించవచ్చు.

గమనిక: ఎలాంటి కేబుల్ లేదా సెట్-టాప్ బాక్స్ లేకుండా లైవ్ టీవీ చూడటానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ లేదా వైఫై (WiFi) తప్పనిసరిగా ఉండాలి.

Read Also

Share Icon

🎤 What is your reaction?
ఈ కథనంపై మీ స్పందన ఏమిటి?
Next Post
Previous Post
No Comment
Add Comment
comment url