Dr BR Ambedkar Quotations & Facts on Cow Slaughter : అంబేద్కర్ చెప్పిన నిజాలు!


మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని కేవలం రాజ్యాంగ నిర్మాతగానే చూస్తాం. కానీ ఆయన ఒక గొప్ప సామాజిక తత్వవేత్త కూడా. సమాజంలో ఏది మంచి, ఏది చెడు అని పైపైన చూడకుండా, దాని మూలాలను వెలికితీసి చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన రాసిన పుస్తకాలను నిశితంగా పరిశీలిస్తే, మన సమాజంలో ఎప్పుడూ చర్చలో ఉండే కొన్ని సున్నితమైన అంశాలపై ఆయన ఎంత లోతైన విశ్లేషణ చేశారో అర్థమవుతుంది. ముఖ్యంగా Ambedkar quotations in english లో ఆయన పాకిస్తాన్ పై రాసిన ప్రముఖ గ్రంథంలో మన దేశ పరిస్థితులపై కొన్ని ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే వాస్తవాలను ప్రస్తావించారు.

 ఈ పుస్తకాన్ని మొదట 1940 లో 'Thoughts on Pakistan' (థాట్స్ ఆన్ పాకిస్తాన్) అనే పేరుతో ప్రచురించారు. ఆ తర్వాత 1945 లో దీనికి కొన్ని మార్పులు చేసి 'Pakistan or the Partition of India' అనే పేరుతో మళ్లీ ప్రచురించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ (Dr. Babasaheb Ambedkar: Writings and Speeches - BAWS) సంపుటాలలో ఇది వాల్యూమ్ 8 (Volume 8) లో పొందుపరచబడింది.

గోవధ విషయంలో ఆయన ఏమన్నారంటే...

మన దేశంలో గోవధ అనేది ఎప్పుడూ ఒక పెద్ద హాట్ టాపిక్, రాజకీయంగా కూడా దీనిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతుంటాయి. దీనిపై అంబేద్కర్ చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇస్లామిక్ ధర్మశాస్త్రాలు లేదా న్యాయశాస్త్రాలు ఎక్కడా కూడా తమ ఆరాధనలో భాగంగా గోవధను కచ్చితంగా చేసి తీరాలని ఎక్కడా శాసించలేదని ఆయన పేర్కొన్నారు.

భారతదేశంలోని వాస్తవ పరిస్థితిని గమనిస్తే మాత్రం కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. ముస్లింలు సాధారణంగా మరే ఇతర జంతువును బలి ఇవ్వడంలో చూపని ఒక ప్రత్యేకమైన ఉత్సాహాన్ని కేవలం గోవధ విషయంలోనే ఎక్కువగా చూపుతారని ఆయన విశ్లేషించారు. దీని వెనుక మతపరమైన కఠినమైన అవసరాలకంటే, అక్కడి స్థానిక సామాజిక పరిస్థితులు మరియు మనుషుల మనస్తత్వాలే ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మసీదుల ముందు మేళతాళాలు పై అంబేద్కర్ విశ్లేషణ

మనం ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలను లేదా ఇస్లామిక్ సమాజాలను చూస్తే... అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నిరభ్యంతరంగా మసీదుల ఎదుట మేళతాళాలు వాయించుకోవడం, వేడుకలు జరుపుకోవడం వంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అక్కడ ఎవరికీ ఎలాంటి మతపరమైన అభద్రతా భావాలు ఉండవు.కానీ, సరిగ్గా అదే భారతదేశానికి వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఇక్కడ మాత్రం ముస్లింలు తమ మసీదుల ఎదుట మేళతాళాలు లేదా సంగీత వాయిద్యాలు వానించకూడదని, ఆ ఊరేగింపులను పూర్తిగా ఆపివేయాలని గట్టిగా పట్టుబడుతుంటారు.

ఈ తేడాకు కారణం ఏమిటి?

ఇలాంటి వైవిధ్యానికి అసలు కారణం ఏంటో అంబేద్కర్ చాలా నిక్కచ్చిగా చెప్పారు. హిందువులు ఆ వాయిద్యాలను లేదా ఆచారాలను తమ సాంప్రదాయపరమైన మరియు సామాజిక హక్కుగా భావిస్తారు. ఆ హక్కును అవతలి వర్గం వారు అంగీకరించడానికి ఇష్టపడకపోవడం, ఒకరకమైన కక్షసాధింపు ధోరణి లేదంటే అపస్మారక భావనే ఈ ఘర్షణలకు అసలు కారణం అని ఆయన ఆ పుస్తకంలో (పేజీ సంఖ్య: 259, 260) తేల్చి చెప్పారు. ఒక వర్గం వారు మరొక వర్గం వారి హక్కులను గౌరవించడానికి ఇష్టపడకపోవడం వల్లనే ఇటువంటి అనవసరమైన సామాజిక ఘర్షణలు పుట్టుకొస్తాయని ఆయన భావించారు.

నేటి సమాజం నేర్చుకోవాల్సింది?

అంబేద్కర్ రాసిన ఈ మాటలు కేవలం నాటి బ్రిటిష్ కాలపు పరిస్థితులకు మాత్రమే కాదు, నేటి ఆధునిక భారత సమాజానికి కూడా ఒక పెద్ద అద్దం లాంటివి. ఒక దేశంలో శాంతిభద్రతలు ఉండాలన్నా, అందరూ ప్రశాంతంగా జీవించాలన్నా కొన్ని విషయాలు మనం గమనించాలి:

➦ ఎవరి ఆచారాలను వారు గౌరవించుకోవడం, పరస్పరం ఒకరికొకరు ఇతరుల హక్కులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

➦ కేవలం రాజకీయ లబ్ది కోసం లేదా రెచ్చగొట్టే రాజకీయాల కోసం ఇలాంటి సున్నితమైన అంశాలను ఎప్పుడూ వాడుకోకూడదు. ఇది దేశ సమైక్యతకు ఏమాత్రం మంచిది కాదు.

➦ అంబేద్కర్ ఎప్పుడూ ఏ ఒక్క వర్గానికి కూడా కొమ్ముకాయలేదు,కేవలం సమాజంలో ఉన్న వాస్తవాలను, లోపాలను నిర్భయంగా ఎత్తిచూపుతూ అందరూ కలిసిమెలిసి బ్రతకాలనే ఒక మంచి మార్గాన్ని చూపించారు.

➦ ఈ చిన్న చిన్న చారిత్రక వాస్తవాలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే, సమాజంలో నిజమైన మార్పు మరియు శాంతి సాధ్యమవుతాయి.

Read Also

9,000కే సూపర్‌ఫాస్ట్ 5G మొబైల్స్: దసరా - దీపావళి పండగ ఆఫర్లు అదుర్స్!

ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు: వారెంటీ, సబ్సిడీ మరియు ధరల సమాచారం!

Share Icon

🎤 What is your reaction?
ఈ కథనంపై మీ స్పందన ఏమిటి?
Next Post
Previous Post
No Comment
Add Comment
comment url